14, నవంబర్ 2014, శుక్రవారం

"ఆటబొమ్మ" అంతటా అతి చవకే! అతి పురాతన వృత్తి వ్యభిచారం మాత్రమే ఆర్థిక మాంద్యానికి అతీతమైనదనే "తిరుగులేవి సత్యం" నిన్నటి ఒక చారిత్రక అసత్యానికి, నేటి మరో అవాస్తవానికి పుట్టిన బిడ్డ!

2008 నుంచి నేటికీ ప్రపంచాన్నివిడవక వదిలే నీడలా వెన్నాడుతున్న ఆర్థిక తిరోగమానానికి దిగజారుతున్న ' ఆటబొమ్మల' బతుకులే సాక్ష్యం. సాక్షి దినపత్రికలో 20-07-2013న ప్రచురితమైన ఈ వ్యాసానికి నేటికీ కాలదోషం పట్టకపోవడమే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందంటూ అమ్ముతున్న అబద్ధానికి సాక్ష్యం.